
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరమే మూడు సినిమాలు తీసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం శ్రీనువైట్ల డైరక్షన్లో మిస్టర్ సినిమా చేస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల తన టాలెంట్ ఏంటో చూపించేందుకు ఈ మిస్టర్ మూవీని భారీగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా ఎక్కువ భాగం ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను నూతన సంవత్సర కానుకగా ఓ రోజు ముందే అనగా ఈరోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
కూల్ లుక్స్ తో మాసీగా కనిపిస్తున్న వరుణ్ తేజ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. కసితో సినిమా తీస్తున్న శ్రీనువైట్ల సినిమా కచ్చితంగా హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఫస్ట్ లుక్ మాత్రం అంచనాలను పెంచేసింది. హెబ్భా పటేల్, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు. కమర్షియల్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ కు సూపర్ సక్సెస్ కోసం కష్టపడుతున్న డైరక్టర్ శ్రీనువైట్లకు ఈ సినిమా హిట్ కిక్ అందించాలని కోరుకుందాం.