
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో ఎస్వీ కృష్ణారెడ్డి ప్రత్యేకత తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న కృష్ణారెడ్డి ఇప్పుడు నందమూరి నట సింహం బాలకృష్ణను డైరెక్ట్ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. కృష్ణారెడ్డి బాలయ్య కాంబినేషనా అంచనాలకు కూడా అందని క్రేజీ కాంబినేషన్ ఇది అని అందరు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం యువ దర్శకుల హవా కొనసాగుతున్న తరుణంలో కృష్ణారెడ్డి లాంటి డైరక్టర్స్ సత్తా చాటగలుగుతారా అని డౌట్ ఉంది.
అందుకే బాలయ్యకు ఫ్యాన్స్ ఆ సినిమా వద్దంటూ కామెంట్స్ పంపిస్తున్నారు. శాతకర్ణి సినిమా తర్వాత కృష్ణవంశీ రైతు సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ సడెన్ గా కృష్ణారెడ్డి డైరక్షన్లో సినిమా అంటున్నాడట. తను చెప్పిన కథ నచ్చడంతో కృష్ణారెడ్డి డైరక్షన్లో సినిమా చేయాలని చూస్తున్నాడు. కాని ఫ్యాన్స్ నుండి విపరీతమైన నెగటివ్ కామెంట్స్ రావడంలో ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ చేశాడని తెలుస్తుంది.
బాలయ్య 100వ సినిమా రేసులో ఉన్న అనీల్ రావిపూడి, బోయపాటి, పూరి జగన్నాథ్ వీరిలో ఎవరైనా 101వ సినిమా డైరక్టర్ అవుతారనుకుంటే సడెన్ గా సీన్ లోకి కృష్ణారెడ్డి వచ్చి షాక్ ఇచ్చాడు. మరి ఫైనల్ గా బాలకృష్ణ తన తర్వాత సినిమా డైరక్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.