పూరిపై అంత నమ్మకం ఏంటో..?

వరుస ఫ్లాపులు తీస్తున్నా సరే డైరక్టర్ కు అవకాశాలు రాకుండా మానవు.. అయితే అవేవో చిన్న చితకా సినిమాలైతే ఓకే కాని ఫ్లాపులు ఇస్తున్నా బడ్జెట్ విషయంలో మాత్రం రాజి పడకుండా చూసుకుంటున్నాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్. ఇజం ఫ్లాప్ తో పూరితో సినిమా అంటే స్టార్ హీరోలు కాస్త వెనుకడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ టైంలో వెంకటేష్ కు కథ వినిపించిన పూరి ఛాన్స్ కొట్టేయడమే కాకుండా సినిమా బడ్జెట్ కూడా 45 కోట్ల దాకా పెట్టబోతున్న విషయం అందరికి షాక్ ఇస్తుంది.

కళ్యాణ్ రాం మార్కెట్ పెంచే ప్రయత్నంలో ఇజం పరిధి దాటి ఖర్చు పెట్టగా అది పూరి లాస్ మిగిల్చింది. మరి ఇప్పుడు వెంకటేష్ తో భారీ బడ్జెట్ అంటుంటే కంగారు పడుతున్నారు వెంకటేష్ ఫ్యాన్స్. ఈ సినిమా సురేష్ బాబు, వెంకటేష్ కలిసి నిర్మిస్తారట. కథ బాగా నచ్చడంతో సినిమా నిర్మాణంలో వెంకీ కూడా భాగమవుతున్నాడు. వెంకటేష్ పూరి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

ఇక ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే చిరు 150వ సినిమా కోసం పూరి తయారు చేసిన ఆటోజాని కథే వెంకటేష్ క్యారక్టరైజేషన్ కు తగ్గట్టు మార్చి వెంకీని ఫుల్ మాస్ పాత్రలో చూపించబోతున్నాడట. మరి పూరిపై వెంకటేష్ పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేస్తాడో చూడాలి.