న్యూ ఇయర్ అక్కడ వెల్కం చెబుతారట..!

సూపర్ స్టార్ మహేష్ ఈవెంట్ ఏదైనా సరే తన ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేయడం మాములే. క్రిస్మస్ వేడుక దుబాయ్ లో చేసుకున్న మహేష్ ఈసారి న్యూ ఇయర్ వేడుకలను యూరప్ లో జరుపుకోనున్నారట. అయితే ఈ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఉపాసనలు కూడా పాల్గొంటున్నారట. వారు అక్కడ దిగిన ఓ పిక్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో వైరల్ గా వెళ్తుంది.

సూపర్ స్టార్ మహేష్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి దిగిన ఈ పిక్ ఇద్దరి ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మహేష్, నమ్రత.. చరణ్, ఉపాసనలు కలిసి చేసుకుంటారని తెలుస్తుంది. ప్రొఫెషనల్ గా పోటీ ఉన్నా సరే తామంతా కలిసి మెలిసి ఉంటామని ఈ పిక్ షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు చెర్రి. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ సినిమా చేస్తుండగా.. చెర్రి మాత్రం ధ్రువ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ట్రిప్ లో వీరితో పాటు మహెష్ బావ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.