
అక్కినేని అఖిల్ రెండో సినిమా విక్రం కుమార్ తో రెడీ అవుతుండగా ఇప్పుడు తన థర్డ్ మూవీకి సమబందించి కూడా డైరక్టర్ ను ఫిక్స్ చేశాడని అంటున్నారు. అఖిల్ హీరోగా డెబ్యూ మూవీ వినాయక్ డైరక్షన్లో రాగా ఆ సినిమా ఫ్లాప్ తో సంవత్సరంపైన గ్యాప్ తీసుకున్న అఖిల్ సెకండ్ మూవీ విక్రంతో ఫిక్స్ చేసి పెద్దగా లేట్ లేకుండా మూడవ సినిమాను సురేందర్ రెడ్డితో చేయాలని నిర్ణయించుకున్నాడట.
ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తుంది. మెగా హీరోలకు వరుసెంట మెగా హిట్లు ఇస్తున్న సురేందర్ రెడ్డి రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు ధ్రువతో కెరియర్ మెమరబుల్ హిట్ అందించాడు. అదే క్రేజ్ తో మెగాస్టార్ సినిమా ఛాన్స్ కొట్టేశాడని వార్తలు వచ్చినా వాటిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే అఖిల్ మాత్రం సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడట. ఒకటి రెండు కథలు కూడా డిస్కషన్లో ఉన్నాయని తెలుస్తుంది.
సో కథ ఫైనల్ అవగానే సురేందర్ రెడ్డితో అఖిల్ సినిమా కన్ఫాం అయినట్టే. ధ్రువ సక్సెస్ తర్వాత కర్ణాటక మాజి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడన్న వార్తలు వచ్చినా ఆ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.