
యాంకర్ గానే కాదు ఇప్పటితరం యూత్ కి ఓ హాట్ ఐకాన్ గా మారిన అనసూయ ఓ పక్క యాంకర్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా స్పెషల్ అప్పియరెన్సెస్ కు ట్రై చేస్తుంది. ఇక ఇవి చాలదు అన్నట్టు నెలకోసారి హాట్ ఫోటో షూట్ అంటూ కేక పెట్టించే లుక్స్ తో ఆడియెన్స్ కు వెర్రెక్కేలా చేస్తుంది. కేవలం తన ముద్దు మాటలే కాదు తన ముద్దులొలికే అందాలు కూడా ప్రేక్షకులు ఇష్టపడతారు.
అందుకే టూ త్రీ వీక్స్ గ్యాప్ తో తన లేటెస్ట్ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ ఇస్తుంది అనసూయ. పెళ్లై పిల్లలు వున్న అమ్మడు ఫాలోయింగ్ లో మాత్రం హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు. ఇంకా చెప్పాలంటే పెళ్లైన హీరోయిన్స్ అసలు పట్టించుకోని ఆడియెన్స్ అనసూయ హాట్ అప్పీల్ కు మాత్రం ఫిదా అవుతారంతే. సో మొత్తానికి ఆడియెన్స్ అటెన్షన్ తన మీద ఓ రేంజ్లో ఉండేలా జాగ్రత్తపడుతున్న అనసూయ ప్రస్తుతం ఐటం సాంగ్స్ కూడా చేస్తుంది.
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో తేజుతో కలిసి ఐటం స్టెప్పులేస్తుంది అనసూయ. తన మీద ఆడియెన్స్ మూడ్ డైవర్ట్ అవ్వకుండా చూసుకుంటున్న అమ్మడిని చూస్తుంటే హీరోయిన్ గా మారడానికి ఎంతో టైం లేదని తెలుస్తుంది. మరి ఆ అవకాశం కోసమే కాబోలు అనసూయ తిప్పలన్ని అనేస్తున్నారు కొందరు సిని పండితులు.