
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150కు సంబందించిన మరో సాంగ్ ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు. దేవి సంగీత సారధ్యంలో యూ అండ్ మీ అంటూ వచ్చిన సాంగ్ శ్రోతలను ముఖ్యంగా మెగా అభిమానులను అలరిస్తుంది. అయితే సినిమాలోని ఈ సాంగ్ హరిహరన్ పాడటం జరిగింది, శ్రీయా ఘోషల్ పాడటం జరిగింది. తన మార్క్ మెలోడీతో ట్యూన్ చేసిన యూ అండ్ మీ సాంగ్ ఖైది మొత్తం ఆల్బం లోనే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.
సాయంకాలానా సాగర తీరానా అంటూ హరిహరన్ పాడిన ఈ సాంగ్ లో మెగాస్టార్ లుక్ కూడా సూపర్ అనేస్తున్నా ఫ్యాన్స్. చిరు ఏమాత్రం తగ్గకుండా కాజల్ కూడా కేక పెట్టిస్తుంది. మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమా మెగాస్టార్ స్టామినా ఏంటన్నది చూపించేందుకు రెడీ అవుతుంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా మెగా రికార్డులను బద్ధలు కొట్టడం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే ఆడియో సాంగ్స్ తోనే రికార్డుల చెడుగుడు ఆడుతున్న మెగస్టార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాడు.