క్రేజీ డైరక్టర్ తో వెంకటేష్...!

టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ కు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫాంలో లేకున్నా సరే రీసెంట్ ఓ మంచి కథతో విక్టరీ వెంకటేష్ ను కలిశాడని వెంకీ కూడా కథ ఓకే చేయడంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నదని తెలుస్తుంది. బాబు బంగారంతో సూపర్ కం బ్యాక్ ఇచ్చిన వెంకటేష్ ప్రస్తుతం గురు సినిమా చేస్తున్నాడు. అసలైతే గురు తర్వాత ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా తీయాల్సి ఉన్నా ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆపేసి పూరి సినిమా చేయాలని చూస్తున్నాడు వెంకటేష్. 

పూరి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఈసారి ఓ మెస్మరైజ్ కథ సిద్ధం చేశాడట. వెంకటేష్ కు కథ బాగా నచ్చేయడంతో గురు తర్వాత చేద్దామనుకున్న కిశోర్ తిరుమల సినిమా పోస్ట్ పోన్ చేసుకుని మరి పూరితో సిద్ధమవుతున్నాడట. మరి పూరి వెంకటేష్ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం రొటీన్ కు భిన్నంగా స్టార్ హీరోలందరు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వారి దారిలో వెంకటేష్ కూడా పూరి సినిమాతో ఓ ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తుంది. పూరి మార్క్ మాస్ ఎంటర్టైనింగ్ సినిమాలో వెంకటేష్ ను చూసి చాలా రోజులైంది మరి వెంకటేష్ ను పూరి ఎలా చూపించనున్నాడో సినిమా మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి.