
నందమూరి బాలకృష్ణ నటించిన వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుక నిన్న సాయంత్రం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వచ్చారు. శాతకర్ణి సినిమా బాలకృష్ణ చేయడం గొప్ప విషయమని. తెలుగు చరిత్రను ఇప్పటి జెనరేషన్ కు చెప్పాలనుకున్న క్రిష్ సక్సెస్ అవ్వాలని అన్నారు. రీసెంట్ గా లెజెండ్ 1000 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా లెజెండ్ కంటే ఎక్కువ రోజులు ఆడాలని కాంక్షించారు.
రాష్ట్ర విభజన జరిగి కొత్త రాజధాని అమరావతిగా పేరు పెట్టడం ఈ సమయంలోనే అమరావతి కేంద్రంగా భరత ఖండం ఏలిన శాతకర్ణి సినిమా రావడం మంచి విషయం అన్నారు. లండన్ లో అమరావతి గ్యాలరీ ఉంది. అమరావతి కేంద్రంగా అప్పట్లో ఎన్నో ఎగుమతులు జరిగేవి. ఆ హిస్టరీ చెప్పేందుకు అక్కడ గ్యాలరీ ఓపెన్ చేశారు. ఇక శాతకర్ణి సినిమా తీస్తున్న బాలకృష్ణ, క్రిష్ లను అభినందించాలన్నారు.
ఒంటి చేత్తో భారతాన్ని ఏలిన తెలుగు చక్రవర్తి శారకర్ణి అయితే నేటి తరం వారికి లెజిండరీ ఎన్టీఆర్ కూడా శాతకర్ణి లాంటి వాడే అంటూ నందమూరి ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు చంద్ర బాబు నాయుడు.