
నవ్వుల రారాజు బ్రహ్మానందం ఎన్ని సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం ఉన్నా సరే తన కొడుకుని హీరోగా నిలబెట్టుకోలేకపోయాడు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన గౌతం ఆ సినిమాలో పర్వాలేదు అనిపించినా తర్వాత వచ్చిన వారెవా, బసంతి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పరిశ్రమకు వచ్చి దశాబ్ధ కాలం అవుతున్నా కనీసం ఒక్క హిట్ కూడా అందుకోలేదు గౌతం. ప్రస్తుతం గౌతం చేస్తున్న సినిమా మను.
షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ ఫణింద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మను టీజర్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా అనిపిస్తున్న ఈ టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసింది. మధురం షార్ట్ ఫిల్మ్ తో తన డైరక్షన్ టాలెంట్ చూపించిన ఫణింద్ర ఈసారి ఫీచర్ ఫిల్మ్ తో తన సత్తా చాటాలనుకుంటున్నాడు. చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అయినా గౌతంకు హిట్ అందిస్తుందేమో చూడాలి.
టీజర్ తో ఏర్పరచుకున్న ఇంట్రెస్ట్ థియేటర్ లో సాటిస్ఫై చేస్తే చాలు ఎన్నాళ్ల నుండో వెయిట్ చేస్తున్న హిట్ గౌతం ఎకౌంట్ లో పడ్డట్టే. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా గురించిన మరిన్ని డీటేల్స్ త్వరలో తెలుస్తాయి.