ఎంగేజ్ మెంట్ డేట్ వచ్చేసిందిగా..!

అక్కినేని నాగ చైతన్య సమంతల పెళ్లి వార్త తెలిసిందే. ఈ జంట ఎప్పుడు ఒకటవుతుంది అని ఫ్యాన్స్ లో ఒకటే ఎక్సయిట్మెంట్. పెళ్లి న్యూసే చాలా లేట్ గా కన్ఫాం చేసిన ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ ఎప్పుడు అన్న విషయం మాత్రం చెప్పట్లేదు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం చైతు, సమంతల నిశ్చితార్ధానికి ముహుర్తం కుదిరినట్టు టాక్. జనవరి 29న నాగ చైతన్య, సమంతల ఎంగేజ్మెంట్ జరుగనున్నదట. 

రీసెంట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది.. పెళ్లి కూడా మే నెలలో పెట్టుకున్నారు. ఈలోగానే చైతు, సమంతల ఎంగేజ్మెంట్ కూడా చేస్తే బాగుంటుందని ఆలోచించి డేట్ ఫిక్స్ చేశారట. ఇక ఎంగేజ్మెంట్ గర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వీరి మ్యారేజ్ జరుగుతుందట. సో మొత్తానికి చైతు సమంత ఒక్కటవబోతున్నారు. ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్ గా చేయాలని అరేంజ్ చేస్తున్నారట. అక్కినేని వారసుడే కాదు దగ్గుబాటి మనవడు కాబట్టి చైతన్య ఎంగేజ్మెంట్ అదిరిపోయే రేంజ్లో ఉంటుందట. పరిశ్రమకు చెందిన సిని ప్రముఖులందరికి ఇన్విటేషన్స్ అందునున్నాయి.