
మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ఖైది నెంబర్ 150 మూవీ రిలీజ్ కు ముందే రికార్డుల పని పడుతుంది. టీజర్ తోనే యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో రికార్డుల మోత మోగించిన మెగాస్టార్ ఇప్పుడు సాంగ్స్ తో కూడా రచ్చ చేస్తున్నాడు. మొదటి సాంగ్ గా రిలీజ్ అయిన అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ ఇప్పటికే 5 మిలియన్ మార్క్ దాటిపోగా క్రిస్ మస్ కానుకగా రిలీజ్ అయిన సుందరి సాంగ్ కూడా సంచలనం సృష్టిస్తుంది.
24 సాయంత్ర రిలీజ్ అయిన ఈ సాంగ్ తెల్లారేసరికి 1 మిలియన్ వ్యూస్ సాధించింది. మరి మెగాస్టార్ మేనియా ఎలా ఉందో ఈ వ్యూయర్ కౌంట్ చూస్తే అర్ధమవుతుంది. సుందరి సాంగ్ ప్రస్తుతం 2.1 మిలియన్ వ్యూస్ తో రచ్చ రచ్చ చేస్తుంది. ఆడియో సాంగ్స్ ఈ రేంజ్లో సంచలనం సృష్టిస్తుంటే ఇక సినిమాలో ఈ సాంగ్స్ కు మెగాస్టార్ డ్యాన్స్ వేస్తుంటే ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఆడియో డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం జనవరి 4న విజయవాడలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న ప్రకారంగా జనవరి 11న సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆడియోతోనే సంచలనంగా మారుతున్న ఖైది సినిమా ఏ రేంజ్లో రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.