సుందరి సాంగ్ తో కేక పెట్టించిన మెగాస్టార్..!

మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ఖైది నెంబర్ 150. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సినిమాలో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ సంచలనం సృష్టించగా క్రిస్మస్ గిఫ్ట్ గా సుందరి సాంగ్ రిలీజ్ చేశారు. ఎప్పటిలానే దేవి తన మార్క్ జోష్ ఫుల్ మ్యూజిక్ ఇవ్వగా సాంగ్ లో మెగాస్టార్ ఎలాంటి స్టెప్పులేస్తాడా అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ తో ఉన్నారు.  

వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఖైది నెంబర్ 150 మెగా ఫ్యాన్స్ కు విందు భోజనం అందించడం ఖాయమని తెలుస్తుంది. సినిమా ప్రతి ఒక్క యాస్పెక్ట్ లో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసేలా చూస్తున్నారట. ఇక రిలీజ్ అయిన సుందరి సాంగ్ ఫోటోస్ లో మెగాస్టార్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. కాజల్ తో సుందరి స్టెప్పులేస్తున్న మెగాస్టార్ కచ్చితంగా ఆడియెన్స్ అంచనాలను మించి సినిమా తీసుకొస్తారని నమ్ముతున్నారు. 

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మెగా హీరోలకు స్పెషల్ గా మ్యూజిక్ అందించే దేవి మెగాస్టార్ కు తన టాలెంట్ అంతా బయట పెట్టేస్తున్నాడు. రిలీజ్ అయిన రెండు సాంగ్ అభిమానుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుకున్నాయి.