
నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ సినిమాగా రాబోతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన క్రిష్ బాలయ్యలు ఇప్పుడు ఈ సినిమా మీద వస్తున్న నెగటివ్ కామెంట్స్ కు సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే డైరక్టర్ క్రిష్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినా సరే ఇంకా శాతకర్ణి కాపీ అంటూ వస్తున్న ట్రోలింగ్ కు బాలకృష్ణ సీరియస్ గా ఉన్నారట.
ఇలాంటి రూమర్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకోమని కావాలని ఇలా నెగటివ్ ప్రచారం చేస్తున్నారని బాలయ్య ఫైర్ అవుతున్నాడు. కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న శాతకర్ణి సినిమాపై వస్తున్న రూమర్స్ రావడం సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇక త్వరలో జరుగనున్న ఆడియో వేడుకలో కూడా ఈ ట్రోలింగ్ చేసే వారికి బాలయ్య వార్నింగ్ ఇస్తాడని అంటున్నారు.
సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి సంచలనంగా మారిన శాతకర్ణి సినిమాపై ఇలాంటి నెగటివ్ ప్రచారం జరగడం ఇబ్బంది కరమే అని చెప్పాలి. మరి వీటిని శాతకర్ణి టీం ఎలా ఓవర్ కం చేస్తుందో చూడాలి.