
స్వామిరారాతో సరికొత్త కథలను ఎంచుకుంటూ కెరియర్ సూపర్ హిట్స్ తో జెట్ స్పీడ్ మీద వెళ్తున్న నిఖిల్ రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం తనకు స్వామిరారా లాంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ సుధీర్ వర్మతోనే కేశవ సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఓ రివెంజ్ డ్రామాగా అనిపిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ అయ్యేలా చేసింది. టాప్ యాంగిల్ లో పిక్చర్ అంత క్లారిటీ లేకున్నా ఓ మనిషిని చుట్టుముట్టిన జనం.. ఇక క్రింద ఏరులై పారుతున్న రక్తం సూపర్ ఫీల్ కలిగిస్తుంది.
సో ప్రీ లుక్ ఈ రేంజ్లో వదిలారంటే సినిమా ఫస్ట్ లుక్ కచ్చితంగా ఇంకా ఇంటెన్సిటీ కలిగించేలా ఉంటుందని చెప్పొచ్చు. సూపర్ ఫాంలో ఉన్న నిఖిల్ తను ఎంచుకున్న కథలే తనకు హిట్ కిక్ ఇస్తున్నాయి. హ్యాపీడేస్ సినిమాతో లీడ్ లీగ్ లోకి వచ్చిన నిఖిల్ కెరియర్ మొదట్లో రకరకాల సినిమాలు తీసినా లాభం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు సరికొత్త పంథాలో తన కెరియర్ కొనసాగిస్తూ సూపర్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.