
మంచు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ఈమధ్య తమ్ముడు మనోజ్ కన్నా కాస్త మెరుగైన ఫాంలో ఉన్నాడని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఈడోరకం ఆడోరకం సినిమా హిట్ అందుకున్న విష్ణు ఇప్పుడు లక్కున్నోడుగా రాబోతున్నాడు. గీతాంజలి రాజ్ కిరణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హాన్సిక విష్ణు సరసన నటించింది.
సినిమా ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అయ్యి మంచి బజ్ ఏరపరచుకున్నా సరే సినిమా రిలీజ్ లేట్ అయ్యింది. మోది నోట్ల బ్యాన్ వల్ల సినిమాలో పాత నోట్ల సీన్ ఉండటంతో ఆ సీన్స్ మళ్లీ రీ షూట్ చేశారట. ప్రస్తుతం అది కూడా పూర్తవడంతో సినిమా రిలీజ్ కు రెడీ అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న లక్కున్నోడు మూవీ ఫిబ్రవరి 3న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి సినిమాల సందడి తర్వాత జనవరి 26న విక్టరీ వెంకటేష్ గురుగా రాబోతున్నాడు. ఫిబ్రవరి 10న కింగ్ నాగార్జున ఓం నమో వెంకటేశాయ రిలీజ్ ప్లాన్ చేశారు. సో ఈ రెండు సినిమాల మధ్యలో ఫిబ్రవరి 3న విష్ణు తన లక్ పరిక్షించుకుంటున్నాడు.
ట్రైలర్ అయితే ఫన్నిగా అనిపించింది మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. తన సూట్ అయ్యే పాత్రలతోనే సినిమాలు చేస్తున్న మంచు విష్ణు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్నాడు.