
బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్ ఎహసన్ లాయ్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ మ్యూజిక్ అందించనున్నారు. హిందిలో క్రేజీ ఆల్బమ్స్ చేస్తున్న వీరు తెలుగులో ఇప్పటికే సిద్ధార్థ్ హీరోగా కొంచం ఇష్టం కొంచం కష్టం సినిమాకు మ్యూజిక్ అందించారు. బాహుబలి తర్వాత సుజిత్ డైరక్షన్లో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ఈ మ్యూజిక్ త్రయం ఫైనల్ అయ్యింది. జేమ్స్ బాండ్ తరహాలో సాగే ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తుంది.
ముందు మినిమం బడ్జెట్ తో సినిమా అనుకున్నా బాహుబలితో ప్రభాస్ రేంజ్ మారిపోవడంతో ఏకంగా 100 కోట్ల పైనే ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. సినిమా బడ్జెట్ విషయంలో రాజి పడకుండా ఖర్చు పెట్టేలా చూస్తున్నారట. ఇక గాల్లో ఫైట్ కోసమే 30 కోట్ల ఎస్టిమేషన్ వేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. బాహుబలి తర్వాత చేస్తున్న ప్రభాస్ సినిమా కాబట్టి ఆ రేంజ్ ఏమాత్రం తగ్గించకుండా చూస్తున్నాడు. మరి బడ్జెట్ ఓకే కాని కలక్షన్స్ కూడా బాహుబలి రేంజ్లో ఉంటాయా లేదా అన్నది చూడాలి.
సంక్రాంతి తర్వాత ముహుర్తం పెట్టుకోనున్న ఈ సినిమాను తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కిస్తున్నారట. సో ఈ లెక్కన చూస్తుంటే ప్రభాస్ ఇక నేషనల్ స్టార్ అయినట్టే అంటున్నారు.