మహేష్ ఎంత మంచోడంటే..!

సూపర్ స్టార్ మహేష్ మరోసారి సూపర్ అనిపించుకున్నాడు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ కు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన టైంలో పివిపి మీతో మరో సినిమా చేస్తా అని చెప్పిన మహేష్ ఇప్పుడు దానికి టైం పట్టేట్టు ఉందని వడ్డీతో సహా ఆ డబ్బులు లెక్క చేసి మరి ఇచ్చాడట. ఏళ్ల తరబడి తమ దగ్గర అడ్వాన్స్ తీసుకుని సినిమా చేస్తా చేస్తా అని టైం పాస్ చేసే హీరోలున్న ఈ టైంలో మహేష్ లాంటి సిన్సియర్ గా డబ్బులు వెనక్కిచ్చే హీరో లేరని చెప్పాలి.

ఇదవరకు ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా దిల్ రాజు, అశ్వనిదత్ లతో కలిసి వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడు మహేష్. అంతేకాదు అప్పట్లో హారిక అండ్ హాసిని అధినేత ఎస్.రాధాకృష్ణ దగ్గర కూడా అడ్వాన్స్ రూపంలో తీసుకున్న ఎమౌంట్ కూడా తిరిగి ఇచ్చాడని తెలిసిందే. కేవలం క్రేజ్ లోనే కాదు మంచి తనంలో కూడా తండ్రి వారసత్వం అందిపుచ్చుకున్నాడని మహేష్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ మూవీ చేస్తున్న మహేష్ ఆ తర్వాత కొరటాల శివ తో సినిమా ఫిక్స్ అయ్యాడు. భరత్ అనే నేను అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఆ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది.