
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల వేగం పెంచారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీదున్న కాటమరాయుడు మూవీనే కాకుండా మరో రెండు సినిమాల షూటింగ్ కు సిద్ధమవుతున్నాడు పవన్. అందులో ముందుగా త్రివిక్రం శ్రీనివాస్ తో చేసే సినిమా స్టార్ట్ అవుతుందట. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల హిట్ తో క్రేజీ కాంబినేషన్ గా మారిన త్రివిక్రం పాన్ మరోసారి వారి మ్యాజిక్ చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటిస్తాడని టాక్. ఇప్పటికే త్రివిక్రం సన్నాఫ్ సత్యమూరి సినిమాలో నటించిన ఉపేంద్ర మరోసారి పవన్ సినిమాలో కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడట.
ఏ, ఉపేంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉపేంద్ర ఇప్పుడు మన దగ్గర సర్ ప్రైజ్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఓ పక్క పవర్ స్టార్ మరో పక్క కన్నడ క్రేజీ స్టార్ ఈ ఇద్దరు కాంబినేషన్ మూవీ అది కూడా త్రివిక్రం లాంటి డైరక్టర్ తో అంటే ఇక సంచలనాలు సృష్టించడానికి ఇంతకుమించి ఏం కావాలి చెప్పండి. ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కాసింత పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. అందుకే సినిమాను 2017 పంద్రాగష్టు కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించారట.