
తన కెరియర్ లో శివ ఓ మెమరబుల్ మూవీ అని ఎన్నోసార్లు చెప్పిన కింగ్ నాగార్జున నిన్న జరిగిన జర్నీ ఆఫ్ ఆర్జివి శివ టు వంగవీటిలో మరోసారి తన అభిప్రాయాన్ని చెప్పారు. తనకు రాము ఓ రైటర్, డైరక్టర్ కన్నా ఓ మంచి ఫ్రెండ్ అన్న నాగార్జున తను రాముకి శివ ఇచ్చాననో తనకు రాము హిట్ ఇచ్చాడనో కాదు శివ అనేది తన జీవితంలో లైవ్ చేంజింగ్ మూవీ అని నాగార్జున అన్నారు. వర్మ కథ చెప్పే సమయంలో తాను పొందిన అనుభూతిని ఫన్నీగా చెప్పిన నాగార్జున ఖాళీ సమయంలో బోర్ కొడుతుంటే వర్మ ట్వీట్ చూస్తే చాలు చాలా విషయాలు కనిపిస్తాయని అన్నారు.
ఇక తన దగ్గరకు శివ సీక్వల్ గా ఎంతోమంది కథలు తెచ్చారని అది తీస్తే గీస్తే రాము తోనే తీస్తా శివ-2 ఎప్పుడు సిద్ధం అన్నా తాను రెడీ అని అన్నారు నాగార్జున. శివ అనేది తన లైఫ్ చేంజింగ్ మూవీ అని.. తెలుగు సినిమాకు కూడా అదో ట్రెండ్ సెట్ చేసిందని ట్రెండ్ సెట్ చేసిన నేషనల్ వైడ్ గా 100 సినిమాల్లో శివ ఉంటుందని అన్నారు. మైక్ అందుకున్న వెంటనే ఆర్జివికి వంగవీటి ఫ్యాన్స్ వేసిన డ్రై ఫ్రూట్ గజమాలను చూసి నవ్విన నాగార్జున ఇలాంటి ఇన్సిడెంట్ కోసం ఎంత సేపు చూస్తూ ఉండమన్నా ఉంటానని అన్నారు.
ఇక ఎవరి కోసమో ఆర్జివి మారాల్సిన అవసరం లేదని.. ఈ ప్రామిస్ లు గట్రా చేయడం ఆర్జివి చేసే పని కాదని.. నువ్వు నీలానే ఉండాలని ఆర్జివిని కోరారు నాగార్జున. కార్యక్రమానికి అమితాబ్ రావాల్సి ఉన్నా కొన్ని టెక్నికల్ ప్రాబ్లెంస్ వల్ల రాలేకపోయారని వివరణ ఇచ్చారు.