వాటికి ఫుల్ స్టాప్ పెడుతున్న రాజ్ తరుణ్

కుర్ర హీరోల్లో రాజ్ తరుణ్ క్రేజ్ గురించి అందరికి తెలుసు.. షార్ట్ ఫిల్మ్ ల నుండి వచ్చి వరుస హిట్లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఈ మధ్య స్పెషల్ అప్పియెరెన్సెస్ ఎక్కువయ్యాయి. కుర్ర హీరో కాబట్టి ఫ్రెండ్ షిప్ కోసమో మొహమాటానికో దర్శక నిర్మాతలు అడిగితే కచ్చితంగా చేయాల్సిందే. ఈ ఇయర్ లో తను హీరోగా మంచు విష్ణుతో చేసిన ఈడోరకం ఆడోరకం హిట్ అవగా ఇక తన కెమియోలో మజ్ఞు, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వచ్చాయి. తను హీరోగా చేస్తున్న సినిమాలు కూడా వీటి వల్ల పోస్ట్ పోన్ అవుతున్నాయట. అందుకే ఇకనుండి అలాంటి రోల్స్ చేయనంటే చేయనని అంటున్నాడట. 

వేరే హీరోల సినిమాల్లో ఇలాంటి స్పెషల్ రోల్స్ చేయడం వల్ల రాజ్ తరుణ్ కు ఒరిగేదేమి ఉండదు. అది కాక ఆ సినిమా రిజల్ట్ ఇంపాక్ట్ మనోడి మీద పడుతుంది అందుకే అసలు అలాంటివి చేయకుండా ఉంటే ఏ గోలా ఉండదు కదా అని డిసైడ్ అయ్యాడట రాజ్ తరుణ్. ప్రస్తుతం రాజ్ హీరోగా కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, లేడీ డైరక్టర్ సంజన డైరక్షన్లో మూవీ చేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతాయట. ఈమధ్య కాస్త జోష్ తగ్గించిన రాజ్ మళ్లీ ఈ మూడు సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కేయాలని ఆశిద్దాం.