
మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత నటిస్తున్న సినిమాగా ఖైది నెంబర్ 150 మూఈకున్న క్రేజ్ తెలిసిందే. ఇప్పటికే టీజర్ తో సంచలనం సృష్టించిన మెగాస్టార్ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ తో మరో అరుదైన రికార్డ్ సొతం చేసుకున్నాడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ మెగాస్టార్ ఖైది సినిమాలోని సాంగ్ నిన్న రిలీజ్ అయ్యింది. అయితే సినిమా కేవలం ఫోటో ఇమేజ్ లతోనే సాంగ్ లిరిక్స్ వదిలారు. ఇక ఈ సాంగ్ మెగా అభిమానుల్లోకి విపరీతంగా వెళ్లడంతో కేవలం ఒక్కరోజులోనే 22 లక్షల వ్యూస్ వచ్చాయి.
ఇదో రకంగా మెగాస్టార్ రచ్చకు నిదర్శనం అని చెప్పొచ్చు. బాలకృష్ణ నటించిన శాతకర్ణి ట్రైలర్ 24 గంటల్లో 2.13 మిలియన్ వ్యూస్ రాబట్టగా మెగాస్టార్ పాటతోనే ఆ రికార్డ్ చెరిపేశాడు. మరి మెగా రచ్చ చూస్తుంటే సంచలనాలకు సిద్ధం కావాల్సిందే అనిపిస్తుంది. ఈ నెల 25న డైరెక్ట్ గా మార్కెట్ లోకి పాటలను రిలీజ్ చేస్తున్న మెగా యూనిట్ జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు.
సినిమాలోని సాంగ్ అది కూడా ఫోటో షూట్స్ తోనే ఇలా రికార్డ్ నెలకొలిపితే ఇక ట్రైలర్ ఆపైన సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సంక్రాంతి బరిలో నువ్వా నేనా అన్నట్టు దిగుతున్న బాలయ్య చిరులు బాక్సాఫీస్ మీద ఎవరు ఎంతలా ప్రభావితం చూపిస్తారో చూడాలి.