నాచురల్ స్టార్ నాని కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహెరిన్ కౌర్ ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఛాన్సులు వచ్చినా ఆచి తూచి అడుగులేస్తున్న అమ్మడు 2017లో కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే శర్వానంద్, సాయి ధరం తేజ్, సందీప్ కిషన్ లాంటి కుర్ర హీరోలతో జోడి కడుతున్న మెహెరిన్ మాస్ మహరాజ్ రవితేజతో కూడా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.
మోడల్ గా క్రేజ్ సంపాదించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెహెరిన్ కౌర్ కూడా తన మార్క్ నటనతో ఆడియెన్స్ ను అలరిస్తుంది. ప్రస్తుతం అమ్మడికి వరుస అవకాశాలను ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక చేసే సినిమాలన్ని హిట్ అయితే కనుక ఇక తర్వాత స్టార్స్ తో తీసేయడమే అని చెప్పేయొచ్చు. ప్రస్తుతం హీరోయిన్స్ కొరతలో ఉన్న టాలీవుడ్ లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగిచుకుంటే మెహెరిన్ కూడా స్టార్ క్రేజ్ సంపాదించినట్టే.