
మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో తనకు నటించాలని ఉంది అంటున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ప్రతి సినిమాకు ప్రయోగాలతో ప్రేక్షకులను ఔరా అనిపించే ఆమిర్ ఖాన్ ఈ నెల 23న దంగల్ సినిమాతో రాబోతున్నాడు. తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు. సౌత్ లో రజినికాంత్ అభిమాని అయిన తను ఛాన్స్ దొరికితే చిరు పవన్ లతో నటిస్తా అంటున్నాడు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో తనకు సినిమా చేయాలని ఉందని ఒకవేళ మహాభరతంలో ఛాన్స్ వస్తే కృష్ణుడిగా తాను రెడీ అంటున్నాడు ఆమిర్ ఖాన్. తెలుగులో డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అప్పుడు తెలుగు భాష నేర్చుకుంటానని అన్నారు ఆమిర్ ఖాన్. దంగల్ సినిమా కోసం బరువు పెరగడం తగ్గడం లాంటివి చేసిన ఆమిర్ పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేందుకు తాను రెడీ అని అంటున్నాడు. అయితే ఇంట్లో వాళ్లు కాస్త కంగారు పడటం కామనే.. కాని ఫైనల్ గా తను చేసే పాత్రలు ప్రేక్షకుల మనసు తాకితే చాలని అంటున్నాడు ఆమిర్ ఖాన్.