చరణ్ సినిమాలో మలయాళ భామ..!

టాలీవుడ్ లో ఒక్క సినిమాతో ఆడియెన్స్ ను మెప్పిస్తే ఇక ఆ భామకు ఎక్కడ లేని క్రేజ్ ఇమేజ్ ఇచ్చేస్తారు తెలుగు ఆడియెన్స్. ప్రస్తుతం మలయాళ సుందరి అనుపమ పరమేశ్వరన్ కూడా అదే క్రేజ్ తో వరుసగా సినిమాలు చేస్తుంది. మలయాళ ప్రేమంలో నటించిన ఈ చిన్నది ఇక్కడ ప్రేమంతో పలుకరించింది అంతకుముందే అఆలో అదరగొట్టిన అనుపమ ఇక్కడ స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేస్తుంది. ఇప్పటికే దిల్ రాజు శర్వానంద్ కాంబినేషన్లో వస్తున్న శతమానం భవతిలో నటిస్తున్న అనుపమ సుకుమార్ రాం చరణ్ కాంబో మూవీలో కూడా లక్కీ ఛాన్స్ కొట్టేసిందట.

తెలుగులో చేసిన రెండు మూడు సినిమాలతో స్టార్ హీరోతో ఛాన్స్ అంటే అనుపమ కచ్చితంగా లక్కీ అన్నట్టే. క్యూట్ గా ఉంటూ ఆడియెన్స్ గుండెలను గిల్లేస్తున్న అమ్మడు అందాలకు తెలుగు ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. సుకుమార్ చరణ్ కలిసి చేస్తున్న పిరియాడిల్ మూవీలో అనుపమ అయితే పర్ఫెక్ట్ అని ఆమెను ఫైనల్ చేశారట. రీసెంట్ గా ధ్రువతో సూపర్ సక్సెస్ అందుకున్న చెర్రి సంక్రాంతి తర్వాత ఈ సినిమాకు ముహుర్తం పెట్టనున్నారు. ఛాన్స్ అయితే కొట్టేసిన అనుపమ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.