
నిన్న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ అప్పుడే సంచలనాలను సృష్టించడం మొదలుపెట్టింది. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ ప్రెస్టిజియస్ మూవీ ట్రైలర్ చూసి తన అభినందనలు తెలిపాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. బాబాయ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్న తారక్ బాలయ్యను కొత్తగా చూపించినందుకు క్రిష్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ట్రైలర్ గురించి తారక్ ట్వీట్ చేయడం మాత్రం చాలా పెద్ద సెన్షేషన్ అని చెప్పాలి.
ఈ ఇయర్ సంక్రాంతికి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ సినిమాల రిలీజ్ తో నందమూరి బాబాయ్, అబ్బాయ్ వార్ అంటూ విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. ఇక నందమూరి ఫ్యామిలీలో చీలిక ఏర్పడిందని తారక్ బాలయ్యకు దాదాపు దూరమయ్యాడని హడావిడి చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా బాబాయ్ ట్రైలర్ గురించి అబ్బాయ్ చేసిన ఈ ఒక్క ట్వీట్ మళ్లీ నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. మరి ఇదే ఊపుతో బాలయ్య, తారక్ కలిస్తే ఇక నందమూరి ఫ్యాన్స్ కు అంతకుమించి పండుగ ఇంకోటి ఉండదు.