
నచ్చిన సినిమా తీస్తే మన హీరోలనే కాదు ఏ పరిశ్రమ నుండి వచ్చినా మన ప్రేక్షకులు అతనికి స్టార్ డం ఇచ్చేస్తారు.. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా మీద టాలీవుడ్ మార్కెట్ మీద కన్నేసిన అరవ హీరోల్లో ఇప్పటిదాకా ఉన్న రజిని, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రం లు కాకుండా మరో తమిళ హీరో కూడా చేరాడు అతనే విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమా అతని ఫేట్ మార్చేసింది. ఆ క్రేజ్ తోనే బేతాళుడు 3 కోట్లకు తీసుకున్నారు. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా బ్రేక్ ఈవెంట్ పాయింట్ రీచ్ అయ్యిందని టాక్.
అయితే తనకు ఇంత ఆదరణ చూపిస్తున్న తెలుగు ఆడియెన్స్ కు ఓ డైరెక్ట్ తెలుగు సినిమా తీసి గిఫ్ట్ గా ఇద్దామనుకుంటున్నాడు విజయ్. ప్రస్తుతం యెమెన్ అనే సినిమాలో నటిస్తున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత డైరెక్ట్ గా తెలుగు భాషలో ఓ సినిమా చేస్తాడట. అయితే ఇది తమిళంలో కూడా రిలీజ్ అవుతుందట. సీనియర్ హీరోయిన్ రాధిక నిర్మిస్తున్న ఈ సినిమా రాడాన్ పిక్చర్స్ లో రానుంది. మరి ఇప్పటికే తెలుగు సినిమాపై తమిళ హీరోల దండయాత్ర చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కొత్తగా విజయ్ ఆంటోని కూడా ఆ లిస్ట్ లో చేరి మన హీరోలకు షాక్ ఇస్తున్నాడు.
ఇక ప్రస్తుతం చేస్తున్న యెమెన్ సినిమా కూడా యముడుగా తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాను రోబో సీక్వల్ గా వస్తున్న 2.0 నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటం విశేషం.