మీసం తిప్పి రాజసం చూపించిన శాతకర్ణి..!

ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. బాలయ్య తన 100వ సినిమాగా చేస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ ఈరోజు కరీంనగర్ లో రిలీజ్ చేశారు. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా శాతవాహన చక్రవర్తి శాతకర్ణి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక సినిమా ట్రైలర్ లో బాలయ్య డైలాగుల పవర్ చూస్తుంటే శాతకర్ణి బాక్సాఫీస్ మీద కూడా దండయాత్ర చేయడం ఖాయమనిపిస్తుంది. 

ట్రైలర్ లోనే సినిమా ఓ ఫీస్ట్ లా ఉంటుందని ఫ్యాన్స్ కు రుచి చూపించాడు డైరక్టర్ క్రిష్. ఇక ఈ ట్రైలర్ కచ్చితంగా మరో బాహుబలిలా అనిపించడం ఖాయం. కళ్లు చెదిరే విజువల్స్ తో అద్భుతమైన గ్రాఫిక్ వర్క్ తో ట్రైలర్ తోనే సినిమా గొప్పతనం చూపించిన క్రిష్ ఇక సినిమా మొత్తం ఎలా తీశాడన్న ఎక్సయిట్ మెంట్ మొదలైంది. ట్రైలర్ సూపర్ హిట్ అవడంతో సినిమా ఎప్పుడు చూసేద్దామన్న కోరిక స్టార్ట్ అయ్యింది.  

ఇక పౌరుశంతో బాలయ్య మీసం తిప్పి రాజసం గురించి చెబుతుంటే భళా ఇది కదా అసలు నటన సింహం అని అనక తప్పదు. మొత్తానికి గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు సంక్రాంతి బరిలో నిలబడుతున్న శాతకర్ణి ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో చూడాలి.