
బడా నిర్మాత పివిపి సూపర్ స్టార్ మహేష్ తో బ్రహ్మోత్సవం అనే ఫ్లాప్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. మహేష్ కెరియర్ లో భారీ డిజాస్టర్ గా బ్రహ్మోత్సవం చెత్త రికార్డు సృష్టించింది. అయితే మరోసారి పివిపితో సినిమా అనగానే ఫ్యాన్స్ నుండి మహేష్ కు వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. పివిపితో బ్యాడ్ సెంటిమెంట్ అంటూ ట్రోలింగ్స్ రావడంతో మహేష్ కూడా పివిపితో డీల్ సెట్ చేసుకున్నాడట. ప్రస్తుతం వంశీ పైడిపల్లితో అసలైతే పివిపి నిర్మాణంలోనే సినిమా చేయాలి కాని అది దిల్ రాజు నిర్మించేలా ప్లాన్ చేశారట.
అంతేకాదు ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా అశ్వనిదత్ కూడా ఉంటారని తెలుస్తుంది. సైనికుడు టైంలో ఇచ్చిన మాట కోసం అశ్వనిదత్ కు కూడా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మహేష్. సో అలా పివిపితో తీయాలనుకున్న సినిమా కాస్త దిల్ రాజు, అశ్వనిదత్ ల చేతుల్లోకి వచ్చి చేరింది. ప్రస్తుతం కథ ఫైనల్ చేసే క్రమంలో వంశీ బిజీగా ఉండగా మురుగదాస్, కొరటాల శివల సినిమాల తర్వాత మహేష్ ఆ సినిమా చేయనున్నాడట.
పివిపితో మాత్రం ఎప్పటికైనా ఓ సినిమా చేస్తా అన్నట్టు హామీ ఇచ్చాడట. ఓ భారీ డిజాస్టర్ నిర్మాతతో సినిమా అంటే భయపడేలా చేసింది. మరి పివిపి ఈ విషయం పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.