
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లక్కీ బ్యూటీ అయిన సమంత టాప్ హీరోయిన్ గా చెలామని అవుతుంది. ఇక త్వరలో అక్కినేని కోడలిగా కొత్త టర్న్ తీసుకుంటున్న సమంతకు అనుకోకుండా ఓ లక్కీ ఆఫర్ వచ్చింది. ఎవడే సుబ్రమణ్యం డైరక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించే సావిత్రి బయోపిక్ లో మహానటిగా సమంతను తీసుకోవాలని అనుకున్నారట. సమంత కూడా దానికి ఓకే చెప్పినా సావిత్రి గారిలా కాస్త లావుగా తయారు కావాలని చెప్పారట.
అయితే అందుకు మాత్రం ఒప్పుకోలేదట సమంత. ఎలా ఉన్నానో అలానే చేస్తా కాని సినిమా కోసం లావు పెరగడం లాంటివి చేయనని ఖరాకండిగా చెప్పేసిందట. సో సమంత దాదాపు కన్ఫాం అనుకుని రిలాక్స్ అయిన మహానటి యూనిట్ కు మళ్లీ టెన్షన్ మొదలైంది. అక్కినేని కోడలిగా మహానటి పాత్ర చేస్తే సమంతకు మంచి క్రేజ్ వస్తుంది. కాని సమంత మాత్రం సినిమా చేయడానికి ఓకే కాని దాని కోసం రిస్క్ చేయలేనని అంటుందట.
సో చేసేదేం లేక మళ్లీ ముందు అనుకున్న నిత్యా మీనన్ నే ఫైనల్ గా సావిత్రిగా సెలెక్ట్ చేస్తున్నారట. మహానటి సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడుతుంది. అశ్వనిదత్ తో పాటుగా ఆయన తనయురాళ్లు స్వప్న, ప్రియాంకా దత్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.