
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లెప్పుడు అనేది గత కొద్దిరోజులుగా హడావిడి చేస్తున్న ప్రశ్న. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ కు వధువుని వెతికే పనిలో పడ్డారు కృష్ణరాజు. అయితే బాహుబలి కోసం నాలుగు సంవత్సరాల కెరియర్ నే కాదు పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటూ వచ్చిన ప్రభాస్ ఎట్టకేలకు తన పెళ్లి సమ్మర్ లో అంటూ సన్నిహితులతో చెబుతున్నాడట. ఇప్పటికే ప్రభాస్ కు కాబోయే అమ్మాయిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు కుటుంబసభ్యులు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ బాహుబలి సినిమా నుండి ఈ నెల చివరన రిలీజ్ అవుతున్నాడు. బాహుబలి మొదటి రెండు పార్ట్ లలో అమరేంద్ర బాహుబలి, శివుడు పాత్రల్లో నటించిన ప్రభాస్ ఆ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరక్షన్లో మూవీకి సిద్ధమవుతున్న ప్రభాస్ సినిమా ముహుర్తం సంక్రాంతికి ఫిక్స్ చేశారని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఉంటుందని అంచనా.