
సూపర్ స్టార్ మహేష్ తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు మొన్నటిదాకా రకరకాల పేర్లు వినబడగా ఫైనల్ గా మూవీకి సంభవామి అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందట. ప్రస్తుతం అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ సంభవామి అని పెట్టడం పట్ల ఫ్యాన్స్ కాస్త అసంతృప్తితో ఉన్నారు. మహేష్ సెంటిమెంట్ టైటిల్ మూడు అక్షరాలే కదా ఆ త్రీ లెటర్స్ లోనే ఏదో ఒక టైటిల్ పెడితే బాగుంటుంది అని సోషల్ సైట్స్ లో రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు.
మరి ఇవన్ని చిత్రయూనిట్ కు చేరుతాయో లేదో తెలియదు కాని మహేష్ టైటిల్ మాత్రం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అయితే దర్శకుడు తమిళ పరిశ్రమకు చెందిన అతను కాబట్టి కచ్చితంగా ఆడియెన్స్ కు నచ్చినట్టు కాకుండా కథకు ఏది కరెక్ట్ అన్నదే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాడు. మహేష్ మార్చాలని అనుకున్నా కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే సంభవామి అన్న దాని మీద ఫ్యాన్స్ ఫిక్స్ అవ్వొచ్చు. ఇక ఓ పక్క సంభవామి అన్న టైటిల్ కూడా అసలు నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది.
జనవరి 1న మహేష్ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఇక అదే నెల 26న అనగా రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.