
అక్కినేని అఖిల్ హీరోగా చేసిన అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సయేషా సైగల్ ఇప్పుడు మరో సూపర్ ఛాన్స్ కొట్టేసింది. అఖిల్ ఫ్లాప్ తో అమ్మడికి అవకాశాలు రాకపోయే సరికి బాలీవుడ్ చెక్కేసిన సయేషా అక్కడ అజయ్ దేవగన్ తో శివాయ్ సినిమాలో నటించి మెప్పిచింది. తెలుగులో ఛాన్స్ వస్తే చేసేందుకు సై అంటూ సిగ్నల్ ఇస్తున్న సయేషాకు ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ దొరికింది. ప్రస్తుతం కాటమరాయుడు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత త్రివిక్రం దానితో పాటుగా తమిళ దర్శకుడు నీశన్ డైరక్షన్లో సినిమాలు చేయాలని ప్లాన్ చేశాడు.
కాటమరాయుడులో శృతి హాసన్ హీరోయిన్ కాగా త్రివిక్రం సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారు. ఇక నీశన్ డైరక్షన్లో మూవీకి సయేషా సైగల్ ను ఫైనల్ చేశారట. పవర్ స్టార్ ఛాన్స్ అంటే స్టార్ హీరోయిన్ గా రెడ్ కార్పెట్ పడ్డట్టే. మరి ఈ అవకాశాన్ని సయేషా ఏ రేంజ్ లో వినియోగించుకుంటుందో చూడాలి. కాటమరాయుడు షూటింగ్ జనవరి కల్లా పూర్తి చేసి ఫిబ్రవరి నుండి అటు త్రివిక్రం ఇటు నీశన్ ఇద్దరితో పర్ఫెక్ట్ షెడ్యూల్ తో షూటింగ్ లో పాల్గొనే ప్లాన్ చేసుకుంటున్నాడు పవన్.