
ప్రవీణ్ ఎస్.విజయ్ దర్శకత్వంలో కోర్టు డ్రామాగా వస్తున్న ‘సత్యవాన్ సావిత్రి’లో కీర్తి సురేష్ లాయర్‌గా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళి వేడుకలో ‘రిప్పీపీ.. రిప్పీపీ..’ అంటూ హుషారుగా సాగే పెళ్ళి పాట నేడు విడుదల చేశారు. రామ్ శ్రీవాత్సవ్ వ్రాసిన ఈ పాటకు శాం సీఎస్ స్సంగీతం అందించగా, ఎంఎస్ జోన్స్ రూపెర్ట్, పద్మలత కలిసి హుషారుగా ఆలపించారు.
ఈ సినిమాలో చారుకేశ్, శరవణన్, శిల్పా మంజునాథ్, మధుసూదనన్, సుందరరాజన్, బ్రిగిడా, మాలా పార్వతి, వెంకటేష్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నటుడు, దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాలో కీలక పాత్ర చేశారు.
ఈ సినిమాను డ్రమ్‌స్టిక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేదిక్కారన్ పట్టి ఎస్.శక్తివేల్ తెలుగు తమిళ్ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.