రియాలిటీ నుంచి భజగోవిందం ప్రమో సాంగ్

కిరణ్‌ అబ్బవరం సొంతంగా వ్రాసుకున్న కథతో స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘రియాలిటీ’ నుంచి ‘భజగోవిందం’ పాట ప్రమో విడుదల చేశారు. రేపు (గురువారం) పూర్తిపాట విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. 

ఈ సినిమాలో చిన్న హోటల్ నడుకుంటూ జీవించే సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడుగా కిరణ్ అబ్బవరం, అతనికి జోడీగా దేవికా భట్‌ నటిస్తున్నారు. 

“ఉన్నంతలో... మనకున్నంతలో బతికితే అదే సుఖమూ.. ‘ అంటూ జీవిత సత్యాలను తెలిపే ఈ పాటను సనారే వ్రాయగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. వైకోమ్ విజయలక్ష్మి చక్కగా ఆలపించారు.      

ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, సాయికుమార్‌, రమేష్‌ ఇందిర, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: కిరణ్‌ అబ్బవరం, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌, ఆర్ట్‌: సుధీర్‌ మాచర్ల,  ఎడిటింగ్‌: సంతోష్‌ నాయుడు చేస్తున్నారు. 

జాయ్‌ ఫిల్మ్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల కానుంది.