ఊహించని న్యూస్ లో రానా రకుల్ ప్రీత్ ?
టాలీవుడ్ హీరోలలో రానా పై వచ్చినన్ని గాసిప్ లు మరే హీరో పైనా రావు. దీనికి తోడు హీరోయిన్స్ విషయంలో రానా ఉండే తీరు కూడ ఈ గాసిప్పులకు మరింత బలాన్ని చేకూరు స్తోంది. రానా త్రిషల పై వచ్చిన వార్తలతో ఏకంగా వారిద్దరి మధ్య పెళ్ళి జరిగి పోయిందా ? అన్న సీన్ క్రియేట్ అయింది.అయితే ఆతరువాత వీరిద్దరి బ్రేకప్ తరువాత రానా పై పెద్దగా గాసిప్పులు రాలేదు. క్రితం సంవత్సరం విడుదలైన ‘బాహుబలి’ తరువాత రానా నేషనల్ స్టార్ గా మారిపోవడంతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ లలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు రానా.అయితే లేటెస్ట్ గా క్రేజీ బ్యూటీ రానా రకుల్ ప్రీత్ ల స్నేహం పై గాసిప్పులు వస్తున్నాయి. ఈమధ్య వీరిద్దరూ చాల సన్నిహితంగా ఉంటూ సందడి చేస్తున్నారని టాక్. దీనితో ఈ కొత్త స్నేహం పై రకరకాల వార్తల హడావిడి మొదలైంది. దానికితోడు రానా తనకు తెలిసిన టాప్ దర్శక నిర్మాతలతో రకుల్ పేరును వారు తీయబోయే సినిమాలకు సూచిస్తున్నట్లు టాక్.
గత వారం మొదలైన ‘ధని ఒరువన్’ తెలుగు రీమేక్ లో చరణ్ పక్కన రకుల్ ఎంపికకు రానా రికమండేషన్ కారణం అనే గాసిప్పులు కూడ ఉన్నాయి. అయితే ప్రస్తుతం తీరిక లేకుండా టాప్ హీరోలందరినీ చుట్టేస్తున్న రకుల్ ప్రీత్ రానా తో తన స్నేహాన్ని మరింత పెంచు కుంటుందా ? లేదంటే ఇక్కడితో సరిపెడుతుందా ?అనే విషయం పై రకరకాల భిన్నాభిప్రాయాలు తలేత్తుతున్నాయి..