2.0లో మెగాస్టార్ సర్ ప్రైజ్..!

సంచలన దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజినికాంత్ కాంబినేషన్లో రోబో సీక్వల్ గా వస్తున్న 2.0 సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజిని త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట. రోబో కన్నా ఇంకా అద్భుతమైన కథతో శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా సినిమాలో మరో సర్ ప్రైజ్ గెస్ట్ రోల్ కూడా ఉన్నదని కోలీవుడ్ టాక్. ఆ రోల్ కు మెగాస్టార్ చిరంజీవిని అడిగుతున్నారట. ఇప్పటికే శంకర్ మంచి కథతో వస్తే తాను నటించేందుకు సిద్ధమే అన్న చిరు 2.0లో అవకాశం ఉంటే కచ్చితంగా చేసేస్తాడు. అయితే మరో మాట ఈ ఛాన్స్ మహేష్ బాబు అందుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మహేష్ కన్నా చిరంజీవినే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా తెరకెక్కిస్తున్న 2.0 సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.