మాస్ మసాలా గుంటూరోడు..!

మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ ఈమధ్య రేసులో వెనుకపడ్డాడని తెలిసిందే. ప్రస్తుతం ఎస్.కె.సత్య డైరక్షన్లో గుంటూరోడు సినిమా చేస్తున్న మనోజ్ రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అదరగొట్టగా ఇప్పుడు సినిమా టీజర్ తో అంచనాలను పెంచేశాడు. గుంటూర్ ఘాటుతో మాస్ మసాల మూవీగా రాబోతున్న ఈ సినిమాలో మనోజ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. తనలోని మాస్ యాంగిల్ మొత్తం ఈ సినిమాలో బయటపెట్టినట్టు కనిపిస్తుంది.

ఇక కుర్ర హీరోలంతా హిట్ సినిమాలతో దూసుకెళ్తుంటే మనోజ్ మాత్రం హిట్ కోసం సతమతమవుతున్నాడు. మంచు మనోజ్ లాస్ట్ రిలీజ్ శౌర్య అట్టర్లీగా పోవడంతో ఈ సినిమాతో అయినా తమ హీరో సూపర్ హిట్ కొడతాడేమో అని ఆశతో ఎదురుచూస్తున్నారు మంచు అభిమానులు. ఓ పక్క తన రూట్ మార్చుకుని కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తీస్తున్న మంచు విష్ణు కాస్త గాడిలో పడ్డట్టు కనిపిస్తుంది.

అయితే మనోజ్ కెరియర్ మొదట్లో రాకింగ్ స్టార్ గా అవతరించినా రాను రాను ఎందుకో ఆ క్రేజ్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన గుంటూరోడు సినిమా అయినా సరే మనోజ్ కు ఓ మెమరబుల్ హిట్ అందిస్తుందేమో చూడాలి.