అబ్బా దేవి నువ్వు కూడానా..!

తెలుగులో ఇప్పుడున్న సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ అని అందరు ఒప్పుకోవాల్సిందే. చేసే ప్రతి సినిమాకు తన మార్క్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే దేవి శ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత చేస్తున్న ఖైది నెంబర్ 150 మూవీ టీజర్ కు కాపీ మ్యూజిక్ అందించాడని ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాలోని ఓ మ్యూజిక్ బిట్ యాజిటీజ్ దించేశాడు దేవి శ్రీ ప్రసాద్. 

సుల్తాన్ చూసి యాజిటీజ్ కొట్టాడా లేక తెలియకుండానే అలా జరిగిందా అన్నది తెలియదు కాని ఖైది లాంటి ప్రెస్టిజియస్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ కాపీ మ్యూజిక్ ఇవ్వడం ఒక్కసారిగా మెగా అభిమానులను షాక్ అయ్యేలా చేసింది. కాస్తా కూస్తో సొంత టాలెంట్ తో రాక్ స్టార్ గా అదరగొడుతున్నాడు అనుకున్న దేవి శ్రీ ప్రసాద్ కూడా ఇలా కాపీ చేయడం దేవి ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

మరి టీజర్ కదా అని కాజువల్ గా అలా చేసి ఉండొచ్చు అందుకే అసలు మ్యూజిక్ ట్రైలర్ లో చూపిస్తాడని అంటున్నారు చిత్రయూనిట్. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఖైది నెంబర్ 150 మూవీను వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నారు.