
అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. త్వరలో పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈసారి మరింత గ్లామర్, మరింత కామెడీ, మరింత సర్‌ప్రైజింగ్‌గా ఈ షో ఉంటుందని నాగార్జున ముందే చెప్పేశారు. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లను ఎంపిక చేసిన్నట్లు తెలుస్తోంది.
ఈ సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్ళబోతున్నారు. వారిలో తొమ్మిది మంది సినీ పరిశ్రమ, సోషల్ మీడియా తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలు కాగా, మరో ఐదుగురు సామాన్య ప్రజల నుంచి ఎంపిక కానున్నారు.
ఈ ఐదుగురు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తవగానే షో మొదలుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో యాంకర్, నటి వర్షిణి, నటి చైత్ర రాయ్, సీరియల్ నటి దేబ్జానీ మోదక్, ప్రముఖ కమెడియన్లు రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ కూడా కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం.
వీరితో పాటు హీరో త్రిగుణ్, నటుడు కృష్ణుడు, ముఖేష్ గౌడ, టెంపర్ వంశీ పేర్లు కూడా కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరెవరు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెడతారనేది త్వరలో తెలుస్తుంది.