రంభ, ఊర్వశి, మేనక… టైటిల్‌ సాంగ్‌ చూశారా?

చంద్రమోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్, సురభి జంటగా చేస్తున్న కామెడీ సినిమా ‘రంభ, ఊర్వశి, మేనక.’ ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ నేడు విడుదలైంది. పక్కా మాస్ బీట్‌తో సాగే ఈ మాస్ సాంగ్‌కి డాన్స్ కూడా పక్కా మాస్‌గానే ఉంది.      

సురేశ్‌ బానిసెట్టి వ్రాసిన ఈ పాటకి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించగా ధనుంజయ్‌ సీపాన, సాహితి చాగంటి కలిసి హుషారుగా పాడారు. ఈ పాటకి విజయ్‌ పొలాకి కొరియోగ్రఫీ చేయగా, రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి అల్లరి నరేష్ చాలా హుషారుగా డాన్స్ చేశారు.  

సీనియర్ నరేష్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, కల్యాణి రాజ్, తారక్ పొన్నప్ప, హరితేజ, గోపరాజు రమణ, గోపరాజు విజయ్, ఆర్.కే.మామ, రచ్చరవి, రవి శివతేజ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: చంద్ర మోహన్ చింతాడ, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, కెమెరా: రామ్ రెడ్డి, డైలాగ్స్: నందు సవిరిగాన చేశారు. 

అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, ప్రసాద్ నిమ్మకాయల కలిసి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 4న విడుదల కాబోతోంది.