ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం లభించింది. ఫోర్బ్స్ ఇండియా పత్రిక కవర్‌ పేజ్‌పై అల్లు అర్జున్‌ ఫోటో వేసి, ఆయన సినీ ప్రస్తానం గురించి కవర్ పేజ్ ఆర్టికల్ వేసింది. ‘షోస్టాపర్స్ 2026’ ప్రత్యేక ఎడిషన్‌లో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది సెలబ్రిటీలను ప్రకటించింది.  

అల్లు అర్జున్‌తో పాటు రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే కవర్ పేజ్‌పై అల్లు అర్జున్‌కి అవకాశం లభించింది. 

పుష్ప-1,2ల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పలు విదేశీ క్రీడాకారులు, సినీ నటులు సైతం ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ డాన్స్ స్టెప్స్, మానరిజం అనుకరిస్తూ మీమ్స్ చేయడం గమనిస్తే, ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్‌ అంతర్జాతీయ స్థాయిలో కూడా పాపులర్ అయ్యారని అర్ధమవుతుంది. 

ఈ నేపథ్యంలోనే ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై బన్నీకి స్థానం దక్కడం సముచితమని భావించవచ్చు. ఫోర్బ్స్ షోస్టాపర్స్ 2026 జాబితాలో షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రభావం చూపుతున్న సెలబ్రిటీలను ఈ జాబితా ద్వారా గుర్తించారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఏఏ-23పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తమ అభిమాన హీరో అల్లు అర్జున్‌ ఫోర్బ్స్ కవర్‌ పేజ్‌పై కనిపించడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.