
విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి తర్వాత జంటగా చేస్తున్న సినిమా ‘రణబాలి.’ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ షూటింగ్ దాదాపు పూర్తవడంతో అక్టోబర్ 16న ‘రణబాలి’ విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
1854-78 మద్య బ్రిటిష్ కాలంలో రాయలసీమలో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రణబాలిలో దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.
గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో రణబాలి నిర్మిస్తున్నారు.
The darkest chapter of our history opens this October.#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26🔥#NeverForget#RanabaaliOnOct16th@TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo @AjayAtulOnline @nirav_dop #JishnuBhattacharjee #ShivamRao… pic.twitter.com/7Na5zev7Pe
— Mythri Movie Makers (@MythriOfficial) August 27, 2026