మెగా లీకేజ్ తో చిరుకి తలనొప్పి..!

బాలీవుడ్ సినిమాలకే కాదు తెలుగు సినిమాలకు ఈ మధ్య లీకేజ్ తలనొప్ప బాగా ఎక్కువైంది. సినిమాకు పనిచేస్తున్న టెక్నికల్ టీం వారే ఈ ఘోరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే బాహుబలి, ఓం నమో వెంకటేశాయ సినిమాలు లీకేజ్ బాట పట్టగా వాటి దారిలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150వ సినిమా కూడా లీక్ అయ్యిందట. సినిమాలోని ఓ సాంగ్ బిట్ లీక్ అయినట్టు సమాచారం. అయితే ఇది చిత్రయూనిట్ పని కాదట. షూటింగ్ లో పాల్గొన్న ఎవరో ఓ మాములు కెమెరాతో వీడియో తీశారట.

అది చాలా లో క్వాలిటీతో ఉండబట్టి ఖైది చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సినిమాలో చిరు స్టెప్పులు మాత్రం అదరగొట్టాడని తెలుస్తుంది. ఇక ఆ వీడియోని యూట్యూబ్ నుండి తొలగించినా సినిమా రిలీజ్ వరకు ఎలాంటి లీకులు లేకుండా కష్టపడాల్సి వస్తుంది. వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 25న విజయవాడలో నిర్వహిస్తున్నారు. ఇంద్ర విజయోత్సవ సభ తర్వాత చిరు విజయవాడలో జరుపుకునే మెగా ఫెస్టివల్ కావడం చేత ఈ ఆడియో వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.