కొరటాల ఆ స్టోరీ కొన్నాడట..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఇప్పుడు కొరటాల శివ ఒకరు. రచయితగానే కాదు దర్శకుడిగా వరుస హిట్లు అందుకుంట్తున్న కొరటాల శివ త్వరలో మహేష్ తో స్టార్ట్ చేయబోయే సినిమా కథ ఓ రచయిత దగ్గర నుండి కొన్నాడని టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది. తకిట తకిట డైరక్టర్ శ్రీహరి మహేష్ కోసం ఓ అద్భుతమైన కథ రాసుకున్నాడట. అదే కథ కొరటాల శివకు వినిపించా శివకు కూడా నచ్చడంతో ఈ కథ తనకు కవాలని కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడట.

ఇక ఆ కథే త్వరలో మహేష్ తో తీయబోతున్న సినిమా భరత్ అనే నేను అని తెలుస్తుంది. అదేంటి కొరటాల శివ ఓ రచయిత కదా మరి అతనెందుకు బయట కథను కొనేయడం అంటే శ్రీహరి చెప్పిన ఆలోచనలోని లైన్ బాగా నచ్చడంతో అది తీసుకుని తన మార్క్ కథనం యాడ్ చేస్తున్నాడట కొరటాల శివ. ఇప్పటికే శ్రీమంతుడు కథ విషయంలో కొరటాల శివ మీద కొన్ని అపవాదాలు వచ్చాయి. వాటి నుండి ఎలాగో తప్పించుకున్న కొరటాల శివ మళ్ళీ ఈ సినిమా స్టొరీ దగ్గర దొరికిపోయాడు.  

మరి వస్తున్న ఈ వార్తల పట్ల కొరటాల శివ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి. ముహుర్తం కూడా పెట్టేసిన ఈ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది.