ఆ ఛాన్స్ కొట్టేసిన సమంత..!

సౌత్ సూపర్ హీరోయిన్ సమంత ఓ లక్కీ చాన్స్ పట్టేసింది. అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ గా వస్తున్న మహానటి సినిమాలో ఫైనల్ గా సమంతను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. నిన్న మొన్నటి దాకా నిత్యా మీనన్ ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయని వార్తలు రాగా వాటినన్నిటిని కొట్టి పారేస్తూ సమంత న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలో అవకాశాలు రావట్లేదు అని దిగులుగా ఉన్న సమంత మళ్లీ ఒక్కసారిగా క్రేజ్ సంపాదించింది.

జనతా గ్యారేజ్ తర్వాత సమంత ఏ ఒక్క తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. నాగ చైతన్యతో పెళ్లి ఫిక్స్ అయిన కారణంగానే తనకు అవకాశాలు రావట్లేదని ఫీల్ అయ్యింది శ్యామ్స్. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మహానటిని అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. కొద్దికాలంగా ఈ కథ మీద వర్క్ చేసిన నాగ్ అశ్విన్ మహానటి బయోపిక్ అద్భుతంగా రాసుకున్నారట. తెలుగు తెరపై తన అభినయంతో ఆకట్టుకున్న అభినయ తార సావిత్రి, మరి ఆమె జీవిత చరిత్ర తెర మీద సమంత కనిపిస్తుందో చూడాలి. అంతేకాదు అక్కినేని కోడలిగా సమంతకు ఈ ఆఫర్ రావడం ఏంతో గొప్ప విషయం  అని చెప్పొచ్చు.