
టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా అదొక సంచలనం అన్నది తెలిసిందే. కేవలం తన స్టేట్మెంట్స్ తోనే చేసే సినిమాల పబ్లిసిటీ చేసుకునే వర్మ ఈసారి తను చేసిన వంగవీటి సినిమాకు విచిత్రమైన ప్రమోషన్స్ చేయదలిచారు. ఈ క్రమంలో వర్మ తీసిన శివ టూ వంగవీటి ప్రస్థానం తన హీరోలు నాగార్జున టూ బిగ్ బి అమితాబ్ ల సమక్షంలో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
వంగవీటి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ గా ఈ నెల 20న హైదరాబాద్ లో ఈ ప్రోగ్రాం జరుగనుంది. ఈ ఈవెంట్ గెస్ట్ లుగా కింగ్ నాగార్జున, బిగ్ బి అమితాబ్ రానున్నారట. వర్మ శివ నుండి తీస్తున్న సర్కార్-3 వరకు జరిగిన సిని ప్రస్థానం గురించి ఈ కార్యక్రమంలో ప్రస్థావించే అవకాశాలు ఉన్నాయి. సో వర్మ వంగవీటి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇలా ప్లాన్ చేశాడన్నమాట. అమితాబ్ వచ్చాడంటే అది కచ్చితంగా ఓ రేంజ్ పబ్లిసిటీ సాధిస్తుంది. ఇక తెలుగులోనే రిలీజ్ చేద్దామనుకున్న వంగవీటి హిందిలో కూడా రిలీజ్ చేసేయొచ్చు. ఆ ప్లాన్ తో సినిమాకు ఓ రకంగా పబ్లిసిటీ మరో విధంగా తన సత్తా ఇది అని చూపించడానికే వర్మ ఈ ఈవెంట్ ప్లాన్ చేశాడని అంటున్నారు.