ఈసారి డబుల్ కిక్ తో ఎన్టీఆర్ ..!

జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన తర్వాత తారక్ చేసే సినిమా ఏదై ఉంటుందా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా డైరక్టర్స్ వేటలో పడ్డ తారక్ ఫైనల్ గా పవర్ డైరక్టర్ బాబికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో తారక్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అదుర్స్ తర్వాత తారక్ చేసే డ్యుయల్ రోల్ సినిమా ఇదే కావడం విశేషం. బాబి చెప్పిన లైన్ తో పాటుగా పర్సనల్ గా ద్విపాత్రాభినయం మీద ఉన్న ఇంట్రెస్ట్ తో తారక్ సినిమా ఫిక్స్ చేశాడట.

గ్యారేజ్ హిట్ తో తారక్ కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పూరి నుండి త్రివిక్రం దాకా కథల చర్చలు జరిపి చివరకు బాబితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో తారక్ డ్యుయల్ రోల్ లో సర్ ప్రైజ్ చేస్తాడట. పవర్ తో డైరక్టర్ గా మారిన బాబి ఆ సినిమాలో కూడా రవితేజను డ్యుయల్ రోల్ లా డిజైన్ చేశాడు. 

సెకండ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ కాస్త బ్యాడ్ నేం తీసుకొచ్చినా ఆ సినిమాలో బాబి పాత్ర తక్కువని తెలిసి మళ్లీ తారక్ తో అవకాశం అందుకున్నాడు బాబి. మరి ఈ లక్కీ ఛాన్స్ ను ఏవిధంగా వాడుకుంటాడో చూడాలి.