గాంధీ జయంతికి ఏకే-47!

అవును! అహింసావాది గాంధీజీ జయంతి రోజునే ఏకే-47 సిద్దమవుతోంది. అంటే తుపాకీ కాదు. విక్టరీ వెంకటేష్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47, టాగ్ లైన్ ఏకే-47 సినిమా. దీని రిలీజ్‌ డేట్ నేడే ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఆదర్శ కుటుంబం పోస్టర్ వేశారు. 

ఈ సినిమాలో వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి భార్యాభర్తలుగా నటిస్తుండగా, దివ్యేందు, నివేతా పెతురాజ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: రవిచంద్రన్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, యాక్షన్: కెవిన్ కుమార్‌ చేస్తున్నారు.   

ప్రస్తుతం  వెంకటేష్‌, ఇతర ముఖ్య నటులపై  హైదరాబాద్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా షూటింగ్‌, వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి, జూన్‌లో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.