
సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలుపెట్టిన కొత్త చిత్రం ‘ధర్మన్’ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ధర్మన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే చాలా స్టైలిష్‌గా కనిపించిన రజినీ, ధర్మన్‌గా ఎలా మారారో ఈ వీడియోలో చూపారు. ముఖ్యంగా మేకప్, ఫోటో షూట్, లుక్ డిజైన్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ఈ సినిమాలో అసాంఘిక శక్తులకు తగిన ట్రీట్‌మెంట్ ఇచ్చి గాడిన పెట్టే వైద్యుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక రజినీ సినిమాకు అవసరమైన మాస్ ఎలిమెంట్స్ అన్నీ ధర్మన్‌లో ఉంటాయని ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే స్పష్టమైంది. సిమ్రాన్, రాశీఖన్నా ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేయబోతున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మన్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్, చేస్తున్నారు.
అశ్వత్థ ముత్తు దర్శకత్వంలో అయన సొంత బ్యానర్ అశ్వత్థ ముత్తు ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ కలిసి ధర్మన్ నిర్మిస్తున్నారు.